Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోసానితో జైలు గేటు వద్ద సీఐడీ పోలీసుల ఫొటోలు

Guntur Police Photo Session With Posani At Jail
Advertisement
  • ఒక రోజు విచారణలో భాగంగా నిన్న సీఐడీ కార్యాలయానికి పోసానిని తీసుకొచ్చిన అధికారులు
  • విచారణ అనంతరం తిరిగి జైలులో అప్పగింత
  • జైలు ప్రధాన ద్వారం వద్ద పోసానితో ఫొటోలు, సెల్ఫీలు 
  • పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్
Advertisement
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వారి కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో అరెస్టై, రిమాండ్‌లో ఉన్న సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళితో సెల్ఫీలు, ఫొటోలు తీసుకునేందుకు గుంటూరు సీఐడీ పోలీసులు క్యూకట్టారు. ఒక రోజు కస్టడీలో భాగంగా నిన్న ఉదయం ఆయనను జిల్లా జైలు నుంచి సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. విచారణ అనంతరం తిరిగి కోర్టులో హాజరుపరిచి జైలులో అప్పగించారు. 

పోసాని జైలుకు వెళ్లే సమయంలో ఆయనతోపాటు వచ్చిన సీఐడీ పోలీసులు జైలు ప్రధాన ద్వారం వద్ద పోసానితో ఫొటోలు తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిమాండ్ ఖైదీతో పోలీసులు ఇలా ఫొటోలు, వీడియోలు తీసుకోవడాన్ని తప్పుబడుతున్నారు. జ్యుడీషియల్ ఖైదీల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసులు ఇలా విధులను పక్కనపెట్టి ఫొటోలు తీసుకోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Advertisement
Advertisement
Posani Krishna Murali
CID Police
Guntur Jail
AP Politics
Remand Prisoner
Controversial Photos
Nara Chandrababu Naidu
Lokesh
Pawan Kalyan
Police Misconduct

More Telugu News